CBSE కీలక ప్రకటన.. ఆ విద్యార్థులకు ఆగస్ట్ నుంచి పరీక్షలు
CBSC కీలక ప్రకటన.. ఆ విద్యార్థులకు ఆగస్ట్ నుంచి పరీక్షలు

న్యూఢిల్లీ : పరీక్షలు, ఫలితాలపై సీబీఎస్ఈ బోర్డు బుధవారం కీలక ప్రకటన చేసింది. 10, 12 తరగతి ప్రైవేటు విద్యార్థుల బోర్డు పరీక్షలు ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉన్నత విద్యలో ప్రవేశాలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫలితాలను సాధ్యమైనంత తక్కువ సమయంలో ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దేశంలో కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గత పరీక్షల ఫలితాల ఆధారంగా ఫలితాలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రైవేటు విద్యార్థులకు మాత్రం ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. గతంలో పలువురు విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో మొదటి, రెండో ప్రయత్నంలో అర్హత సాధించలేకపోయారు. పలువురు మరింత మెరుగైన మార్కుల కోసం మరోసారి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేటు విద్యార్థులకు.. రెగ్యులర్ విద్యార్థులకు అమలు చేసినట్లుగా అసెస్మెంట్ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఈ విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి అసెస్మెంట్ రికార్డులు లేకపోవడమే ఇందుకు కారణమని సీబీఎస్ఈ పేర్కొంది. పాఠశాలలు సాధారణంగా విద్యార్థులకు యూనిట్, మిడ్ టర్మ్, ప్రీ బోర్డు పరీక్షలు నిర్వహించే విషయం తెలిసిందే. ప్రైవేటు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. మార్కుల టాబులేషన్ విధానాన్ని అమలు చేయలేమని చెప్పింది. ఈ విషయంపై సుప్రీం కోర్టులో సైతం చర్చించామని.. వారికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. రెగ్యులర్ విద్యార్థుల ఫలితాలను ఈ నెలాఖరు వరకు ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి..
విషాదం.. ఇండ్లు కూలి ఏడుగురు దుర్మరణం
శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
Airmen Exam : హైటెక్ కాపీయింగ్.. సౌరభ్ అరెస్ట్
షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కేంద్ర ప్రభుత్వంపై కేసు పెట్టాలి : ఎంపీ సంజయ్ రౌత్
ఏపీలో కొత్తగా 2,527 కరోనా కేసులు
Bird Flu : భయం వద్దు.. మనుషులకు సోకే అవకాశం తక్కువే : ఎయిమ్స్ డైరెక్టర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

