CBSE : సీబీఎస్ఈ 12వ తగరతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తంగా విద్యార్థులు 85.20 శాతం విద్యార్థినీ, విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. బాలికల ఉత్తీర్ణతా శాతం 88.6 శాతంకాగా, బాలుర ఫలితాల శాతం 82.13 శాతంగా ఉంది.
ఫలితాల్ని విద్యార్థులు cbse.gov.in, results.cbse.nic.in and at Digilocker, UMANG app ద్వారా తెలుసుకోవచ్చు. తాజా ఫలితాల్లో అత్యధిక ఫలితాలు సాధించిన టాప్ 6 జిల్లాలు ఇవే. త్రివేండ్రం, చెన్నై, బెంగళూరు, విజయవాడ, ఢిల్లీ ఈస్ట్, ఢిల్లీ వెస్ట్. ఫలితాల్లో 95.62 శాతంతో త్రివేండ్రం టాప్ స్థానంలో నిలిచింది. ప్రయాగ్రాజ్ 72.43 శాతంతో అత్యల్ప ఫలితాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఈ ఏడాది 85.20 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. గత ఏడాది 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే, ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం తగ్గింది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఫలితాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి ఫలితాలు గత నెలలోనే విడుదలైన సంగతి తెలిసిందే.