Karthi | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi), టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీకి జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. కాగా ఈ చిత్రానికి మరో దర్శకుడు పనిచేయబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మిరాయి, ఈగల్ సినిమాలను డైరెక్ట్ చేసిన కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేయబోతున్నాడు. దీంతో కార్తీక్ ఘట్టమనేని ఇక సినిమాటోగ్రఫర్ కమ్ డైరెక్టర్‌గా మారిపోయాడన్నమాట.
టాలీవుడ్లో ‘మ్యాడ్’ (MAD) , ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ కార్తీతో కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్, కళ్యాణ్ శంకర్ మార్క్ హ్యూమర్ టచ్‌తో రాబోతున్నఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు