భోపాల్: బీజేపీ మద్దతు గల జిల్లా పంచాయతీ సభ్యురాలి భర్త మనోహర్‌లాల్ ధాకడ్ వేరొక మహిళతో నడిరోడ్డుపై పట్టుబడ్డారు. ధాకడ్ భార్య మధ్య ప్రదేశ్‌లోని మందసార్ జిల్లా పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యురాలిగా ఉన్నారు. ధాకడ్ వేరొక మహిళతో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై రాత్రి వేళ కారు పక్కన అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను ఈ నెల 13న చిత్రీకరించినట్లు తెలుస్తున్నది. అయితే ధాకడ్ తమ పార్టీ సభ్యుడు కాదని బీజేపీ తెలిపింది. ధాకడ్‌ను ధాకడ్ మహాసభ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తొలగించినట్లు ఆ సంఘం ప్రకటించింది.