న్యూఢిల్లీ, జనవరి 4: సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తున్నవారికి శుభవార్తను అందించింది కార్స్24. తక్కువ వడ్డీకే సెకండ్ హ్యాండ్ కార్లపై రుణాలు అందించడానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో కార్ల కొనుగోళ్లు మరింత పెరుగనున్నాయని అభిప్రాయపడింది. తాజా డీల్‌తో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలు పడనున్నదని వెల్లడించింది.