Chiranjeevi | ‘తొక్కేసావా?’.. సోషల్ మీడియా ట్రెండ్‌పై చిరంజీవి పంచ్
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు ఆసక్తికరమైన పోస్టులు, కామెంట్లతో అభిమానులను అలరిస్తుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ సరదా వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్‌కు ముడిపడి చర్చనీయాంశంగా మారింది.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు ఆసక్తికరమైన పోస్టులు, కామెంట్లతో అభిమానులను అలరిస్తుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ సరదా వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్‌కు ముడిపడి చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా జరిగిన ‘సిగ్మా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువ కథానాయిక ఫరియా అబ్దుల్లాతో మెగాస్టార్ సరదాగా సంభాషించారు. ఈ సందర్భంగా ఫరియాను ఉద్దేశించి చిరంజీవి చేసిన ‘నన్ను తొక్కేసావా?’ అనే కామెంట్ అక్కడ నవ్వులు పూయించింది.
అయితే ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ‘తొక్కేశాడు’, ‘తొక్కేసారు’ అంటూ కొన్ని మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అదే పదాన్ని చిరంజీవి స్వయంగా సరదాగా ఉపయోగించడంతో అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.మెగాస్టార్ చేసిన కామెంట్‌ని కొందరు నెటిజన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్‌కు సరదా కౌంటర్‌గా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలను చిరంజీవి గమనిస్తూనే ఉంటారని, అందుకే సందర్భాన్ని బట్టి ఇలాంటి పదాలను కూడా తన మాటల్లోకి తీసుకువస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
సినిమా ఈవెంట్లలో చిరంజీవి తనదైన శైలిలో సరదాగా మాట్లాడటం కొత్తేమీ కాదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పదాన్ని ఆయన స్వయంగా ప్రస్తావించడంతో ఈసారి ఆ కామెంట్‌కి మరింత ప్రాధాన్యత వచ్చింది. మొత్తానికి ఫరియా అబ్దుల్లాతో చిరంజీవి చేసిన సరదా సంభాషణలోని ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. మెగాస్టార్ సోషల్ మీడియాను ఎంత నిశితంగా గమనిస్తున్నారో ఈ కామెంట్‌తో మరోసారి అర్థమవుతోందంటూ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

