PM Modi | శుభాంశు శుక్లా 140 కోట్ల మంది ఆకాంక్షలను మోసుకెళ్లారు : ప్రధాని మోదీ
PM Modi | భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు.
PM Modi : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఈ మిషన్కు శుక్లా గ్రూప్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. దీనిపై తాజాగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు.
ఇక భారత్, హంగెరీ, పోలాండ్, యూఎస్ వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ వ్యోమగాములకు అభినందనలు తెలియజేశారు. భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. కోట్ల మంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని కొనియాడారు.
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఫాల్కన్ 9 రాకెట్ సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వారు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంటే గురువారం సాయంత్రం 4.30 గంటలకు వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది.
ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజులపాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో వ్యోమగాములు అక్కడి నుంచి ముచ్చటించనుననారు.
Read More >>
మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
డ్రగ్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి అరెస్ట్..!
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
అణు కేంద్రాలు ధ్వంసం కాలేదన్న అమెరికా ఇంటెలిజెన్స్.. ఆ రిపోర్టును కొట్టిపారేసిన అధ్యక్షుడు ట్రంప్
నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ తిరుపతి
తావి నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

