దుబాయ్ : దుబాయ్లో ఓ కారు నంబర్ ప్లేటు వేలంలో రికార్డు ధర పలికింది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు అథారిటీ నిర్వహించిన వీఐపీ నంబర్ ప్లేట్ల వేలం కార్యక్రమంలో ‘పీ 7’ అనే నంబర్ ప్లేటు ఏకంగా 55 మిలియన్ దిర్హామ్(రూ.122.6 కోట్లు)లకు అమ్ముడు పోయింది.
వేలంలో ఇంకా ఏఏ22, ఏఏ19 అనే నంబర్ ప్లేట్లు వరుసగా సుమారు రూ.18 కోట్లు , రూ.10 కోట్లు పలికాయి. మరికొన్నింటికి కూడా వేలం నిర్వహించారు.