సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన అంకుశ్ వినాయక్ రాథోడ్ ఒడిశాలో గంజాయిని కిలో రూ. 5 వేలకు కొని.. బీదర్ ఇతర ప్రాంతాల్లో రూ. 10 వేలకు విక్రయిస్తున్నాడు. దత్తాత్రి, మారుతీ రఘునాథ్ రాథోడ్, రాముతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఇటీవల ప్రధాన గంజాయి విక్రయదారుడు ఒడిశాకు చెందిన జయ మడులికు 12 కిలోల గంజాయి ఆర్డర్ ఇచ్చిన అంకుశ్.. అందుకు సంబంధించిన డబ్బును ఆన్లైన్లో బదిలీ చేశాడు. ఈ క్రమంలో ఎంజీబీఎస్ బస్టాండ్‌లో అంకుశ్ ముఠాకు గంజాయి అందించాలని ఒడిశాకు చెందిన జయరామ్‌ను జయమడులి ఆదేశించాడు. శుక్రవారం అతడు బస్టాండ్‌లో గంజాయిని అంకుశ్ గ్యాంగ్‌కు అందించేందుకు యత్నిస్తుండగా, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం పట్టుకొంది.
డ్రగ్స్ విక్రయిస్తూ..
మాదాపూర్, నవంబర్ 19: డ్రగ్స్ విక్రయిస్తున్న యువకులను మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. నిరంజన్ (27), దుర్గా ప్రసాద్ (29) ,గౌతమ్(26), అర్జున్ (20) డ్రగ్స్ విక్రయించేందుకు శుక్రవారం అయ్యప్పసొసైటీ 100 ఫీట్ రోడ్డుకు రాగా, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపారు.