బూర్గంపహాడ్, ఆగస్టు 31 : ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామ ఆదివాసీ బిడ్డ శిరీష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాత్రి శిరీష మృతికి సంతాపంగా మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ంధీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హైదరాబాద్లో ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్య సహాయకురాలిగా నిరంతరం సేవలందించే నర్సు శిరీషను హత్య చేసిన వారిని వదలొద్దని, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించి కారకులకు కఠినశిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. శిరీష పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.