Ananthika Sanilkumar | టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రోమాంచకం. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనంతిక సనిల్ కుమార్, సుమంత్ ప్రభాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అనంతిక సనిల్ కుమార్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
రోమాంచకం సినిమా గురించి మాట్లాడుతూ.. 8 వసంతాలు తర్వాత నేను చాలా కథలు విన్నా. కానీ వాటిలో ఏవీ కూడా ఎక్జయిటింగ్‌గా అనిపించలేదు. అప్పుడే రోమాంచకం స్టోరీ నా దగ్గరకు వచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో సాదాసీదాగా కనిపించే అమ్మాయిగా నటించా. యూత్‌కు రోమాంచకం కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో ప్రేమతోపాటు కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయంది.
నేటి యువత జీవితాల్లో చోటుచేసుకుంటున్న సమకాలీన అంశాలను రోమాంచకరం ప్రతిబింబిస్తుంది. మా సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వీక్షించవచ్చు. నాతో పోలిస్తే సుమంత్ ప్రభాస్ ఈ మూవీ కోసం చాలా వర్క్ షాప్స్‌లో పాల్గొన్నారు. ఆయన పాత్ర ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. మా మధ్య డైలాగ్స్ చాలా సహజంగా ఎక్కడా సాగదీసినట్టుగా అనిపించకుండా సాగుతాయని చెప్పుకొచ్చింది.
Novak Djokovic: తొలి రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్.. యూఎస్ ఓపెన్‌లో ఏడ్చిన జోకోవిచ్
Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!
SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే