MLA Mutha Gopal | గంగపుత్ర మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు సాగాలి : ఎమ్మెల్యే ముఠా గోపాల్
MLA Mutha Gopal | గంగపుత్రులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
హైదరాబాద్ :గంగపుత్రులు (Gangaputra women ) సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్(MLA Mutha Gopal ) అన్నారు. గంగపుత్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన గంగపుత్ర వర్కింగ్ ఉమెన్స్ సమావేశం తార్నాకలోని సత్యోదయ రిట్రీట్ మందిరంలో ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 200 మందికి పైగా గంగపుత్ర మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. పిల్లలను ఉన్నత విద్య చదివించి, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
గంగపుత్ర వర్కింగ్ ఉమెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ దేశబోయిన రమాదేవిని, ప్రధాన కార్యదర్శిగా పంపరి మంగ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా 35 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ దేశబోయిన రఘు , పాక రవి ప్రసాద్ , మహిళా సంఘం అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ , గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు పాక సృజన్ , శంకర్ , అక్కపల్లి ఉదయ్ కిరణ్ , డి. భాస్కర్ , భూపతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

