తిరుమల : తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా ఈ నెల 27, 28, 29వ తేదిలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లో , తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేయబడవని వివరించారు.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని సూచించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలోని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 72,355 మంది భక్తులు దర్శించుకోగా 37,154 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.12 కోట్ల ఆదాయం (Income) వచ్చిందని తెలిపారు.