కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 44 మందికి ఉద్యోగాలు
కోదాడ కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 44 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఉత్పత్తి రంగ సంస్థ ఎంఆర్ఎఫ్ ఆధ్వర్యంలో..
కోదాడ, నవంబర్ 12 : కోదాడ కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 44 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఉత్పత్తి రంగ సంస్థ ఎంఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాలలో ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. సంస్థ మానవ వనరుల అధికారి విజయకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో కళాశాలకు చెందిన 44 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థినులకు సంవత్సరానికి రూ.3,50,000 వేతనం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ ఎంపికైన విద్యార్థినులను అభినందించారు. టీపీఓ పుష్పలత, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినులను అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 44 మందికి ఉద్యోగాలు
సంస్కరణల పేరిట విద్యార్థుల భవిష్యత్‌తో ప్రయోగాలా?
సారపాకలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీకి వినతి
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

