DSA | డెమోక్రటిక్ స్టూడెంట్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాల దహనం
బడ్జెట్లో విద్యాశాఖకు తీవ్ర అన్యాయం చేశారని డీఎస్ఏ ఆధ్వర్యంలో విద్యాశాఖ బడ్జెట్ పత్రాలను దహనం చేశారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 23: హనుమకొండ జూనియర్ కాలేజీ జంక్షన్లో డెమోక్రటిక్ స్టూడెంట్స్అసోసియేషన్(డీఎస్ఏ) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకు తీవ్ర అన్యాయం చేశారని విద్యాశాఖ బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ మాట్లాడుతూ.. శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ర్ట బడ్జెట్లో విద్యారంగానికి కేవలం నామమాత్రపు కేటాయింపులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
కొఠారి కమిషన్ ఆధారంగా రాష్ర్ట బడ్జెట్లో కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని కమిషన్ తెలియజేసిందని, దాన్ని గాలికి వదిలేసిందన్నారు. సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక నామమాత్రపు నిధులను 26,674కోట్లు అనగా బడ్జెట్ లో 8.22శాతం నిధులను మాత్రమే కేటాయిస్తూ చేతులు దులుపుకుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజ్‌కుమార్, కమల్, వంశీ, సంపత్, రాజేష్, భానుప్రతాప్, లావణ్య, సృజన, రమ్య, అంజలి, అక్షిత, నాగేశ్వరీ, శివాని పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

