రామగిరి, మార్చి 11 : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఫీజులు అదనంగా రూ.5 వేలు ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని, అదనంగా వసూలు చేసిన ఫీజులను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఎంజీయూలో బీటెక్ విద్యార్థుల ఆందోళన