Maruti Grand Vitara Costly | బీఎస్-6 2.0 ఆర్డీఈ ఎఫెక్ట్.. మారుతి గ్రాండ్ విటారా ధర రూ.30 వేలు అదనం.. సీఎస్టీ వేరియంట్ మరింత కాస్ట్లీ
Maruti Grand Vitara Costly | రెండో దశ బీఎస్-6 ప్రమాణాలు అమలు చేయాల్సి రావడంతో మారుతి గ్రాండ్ విటారా ధరలు భారీగా పెరిగాయి.
Maruti Grand Vitara Costly | కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలు కఠినతరం కావడంతో కార్ల తయారీ సంస్థలు వివిధ మోడల్ కార్ల ధరలు పెంచేశాయి. రెండోదశ బీఎస్-6 నిబంధనల్లో భాగంగా ఎప్పటికప్పుడు కార్ల నుంచి వెలువడే ఉద్గారాల పర్యవేక్షణకు `రియల్ టైం ఎమిషన్ (ఆర్డీఈ – Real Driving Emission)` ఏర్పాటు చేయాలన్న నిబంధన తేవడమే దీనికి కారణం. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అన్ని కార్లపై 0.8 శాతం ధరలు పెంచేసింది. కార్ల తయారీతోపాటు రెగ్యులేటరీ నిబంధనలు పాటించడం, ఆర్డీఈ నిబంధనలకు లోబడి ఇంజిన్ అప్‌గ్రేడ్ చేయాల్సి రావడంతో ధరలు పెంచక తప్పడం లేదని తెలిపింది.
మారుతి సుజుకిలో మిడ్ సైజ్ ఎస్యూవీ గ్రాండ్ విటారా (Grand Vitara) ధరలు రూ.30 వేలు పెరిగాయి. గ్రాండ్ విటారా (Grand Vitara) కారు ధరలు రూ.10.70 లక్షల నుంచి టాప్ మోడల్ రూ.19.95 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇక సీఎన్జీ వేరియంట్ ధర రూ.12.85 లక్షల నుంచి రూ.14.84 లక్షలకు పెరుగనున్నదని తెలుస్తున్నది.
పెరిగిన గ్రాండ్ విటారా ధరలు ఇలా
వేరియంట్ ————- పెరిగిన ధర
డెల్టా ——————— రూ.20,000
సిగ్మా ——————– రూ.25,000
స్ట్రాండ్ హైబ్రీడ్ ——- రూ.30,000
విటారా డెల్టా ———– రూ.20,000
ఇతర కార్ల తయారీ కంపెనీల నుంచి పోటీ ఎక్కువ కావడంతో మారుతి సుజుకి మిడ్‌సైజ్ ఎస్యూవీ మోడల్ గ్రాండ్ విటారా (Grand Vitara)ను గతేడాది సెప్టెంబర్ 26న ఆవిష్కరించింది. ఈ కారును మార్కెట్లోకి తెచ్చినప్పటి నుంచి ధర పెంచడం ఇదే మొదటి సారి. గ్రాండ్ విటారా (Grand Vitara) మోడల్ కార్లు 16 వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ కారు 1.5 లీటర్ల ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల స్ట్రాంగ్ హైబ్రీడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్/ సీవీటీ వేరియంట్లలో లభిస్తుంది.
ఐదు సీట్ల మిడ్ సైజ్ ఎస్యూవీ కారు గ్రాండ్ విటారా.. ఇతర కార్ల తయారీసంస్థలు హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజీ మోటార్స్ అస్టర్ అండ్ టైగూన్, స్కోడా కుషక్, టయోటా హైరైడర్‌లతో పోటీ పడుతున్నది.
ఈ కారు 7-అంగుళాల మల్టీ ఇన్ఫో డిస్ప్లే, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ డిస్క్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్, టీపీఎంఎస్ తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది. డిజిటల్ క్లస్టర్, నెక్సావేవ్ గ్రిల్లే, నెక్స్ట్ ట్రీ 3డీ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్ అప్ డిస్ప్లే, వైర్లెస్ చార్జర్, సుజుకి కనెక్ట్ తదితర ఫీచర్లు జత చేశారు. ఎల్ఈడీ లైట్ బార్, అల్లాయ్ వీల్, సీ-పిల్లర్ క్రోమ్ వర్క్ విత్ 6-ఎయిర్‌బ్యాగ్స్ ఫర్ సేఫ్టీ, క్రోమ్ లైన్డ్ హెక్సాగోనల్ గ్రిల్లే, ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్, 17- అంగుళాల అల్లాయ్ వీల్స్, మెయిన్ హెడ్ ల్యాంప్ కస్టర్ ఆన్ బంపర్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

