మెదక్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో మిలిటరీ ఉద్యోగి ( Military Employee ) పొన్నం కుమార్ గౌడ్ (45) అనుమానాస్పద స్థితిలో హత్యకు ( Murder ) గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మెదక్( Medak ) మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి మిలిటరీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం ఆయన మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.