Mumbai Concert | లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి..!
Mumbai Concert | మహానగరం ముంబై (Mumbai) వర్లీలోని ప్రసిద్ధ ‘ఎన్ఎస్సీఐ డోమ్ (NSCI)’లో జరిగిన ఓ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ (Live Music Concert) ఊహించని విషాదంతో ముగిసింది. వేలాది మంది సంగీతాభిమానుల కోలాహలం మధ్య ఓ 28 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ముంబైలోని మాహిమ్ ప్రాంతానికి చెందిన 28 వృషభ్ మహేంద్ర గాంగుర్డే (Vrishabh Mahendra Gangurde) గా పోలీసులు గుర్తించారు.
Mumbai Concert : మహానగరం ముంబై (Mumbai) వర్లీలోని ప్రసిద్ధ ‘ఎన్ఎస్సీఐ డోమ్ (NSCI)’లో జరిగిన ఓ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ (Live Music Concert) ఊహించని విషాదంతో ముగిసింది. వేలాది మంది సంగీతాభిమానుల కోలాహలం మధ్య ఓ 28 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ముంబైలోని మాహిమ్ ప్రాంతానికి చెందిన 28 వృషభ్ మహేంద్ర గాంగుర్డే (Vrishabh Mahendra Gangurde) గా పోలీసులు గుర్తించారు. తన స్నేహితులతో కలిసి ఈ కాన్సర్ట్‌కు హాజరైన వృషభ్.. డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. విపరీతమైన రద్దీ కారణంగా వృషభ్తోపాటు అతనితో ఉన్న ఒక యువతి కూడా తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. స్పృహతప్పిన వృషభ్ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ, అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తార్దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వృషభ్ ఆరోగ్య పరిస్థితి విషమించడానికి ముందు అతను మద్యం సేవించి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నప్పటికీ, ఏదైనా ఇతర పదార్థాల ప్రభావం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
పోస్ట్‌మార్టం నివేదిక ఇతర వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే యువకుని మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటన ముంబైలో భారీ స్థాయిలో జరిగే కాన్సర్ట్ల భద్రతా ఏర్పాట్లపై చర్చకు తెరలేపింది. ఎన్ఎస్సీఐ క్లబ్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. అంత భారీ సంఖ్యలో జనం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, అక్కడి వాతావరణం అంతా గందరగోళంగా మారిందని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

