Nag Ashwin | ఈవెంట్లో నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్.. స్టార్ డైరెక్టర్ సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా!
Nag Ashwin | తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, ‘మహానటి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అనంతరం ‘కల్కి’ వంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి దిగ్గజ నటులను ఒకే తెరపై అద్భుతంగా ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు.
Nag Ashwin | తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, ‘మహానటి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అనంతరం ‘కల్కి’ వంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి దిగ్గజ నటులను ఒకే తెరపై అద్భుతంగా ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘కల్కి 2’ పనుల్లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్, దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘సింగ్ గీతం’ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 11న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా లోకనాయకుడు కమల్ హాసన్ పాల్గొనడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. అయితే కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. హాజరైన అతిథుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గెస్టుల కోసం ఏర్పాటు చేసిన సీట్లు సరిపోలేదు. దీంతో వచ్చిన వారెవరూ ఇబ్బంది పడకూడదని భావించిన నాగ్ అశ్విన్, ఎలాంటి హంగామా లేకుండా తనకు కేటాయించిన సీటును వదిలి నేలపై కూర్చున్నారు.తాను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ డైరెక్టర్ అన్న విషయం పక్కన పెట్టి, సాధారణ వ్యక్తిలా సోఫాల పక్కనే నేలపై కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. కమల్ హాసన్ వంటి సినీ దిగ్గజాల పక్కన కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ, అతిథుల సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ నిరాడంబర స్వభావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ, “విజయం ఎంత వచ్చినా వినయం కోల్పోలేదు”, “ఇదే నిజమైన గొప్పతనం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ అభిమానుల మనసులు గెలుచుకుంటున్న నాగ్ అశ్విన్ మరోసారి తన సింప్లిసిటీతో ప్రత్యేకంగా నిలిచారు.
ఏంటండీ ఈ మనిషి…
ఈయనేనా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన #Mahanati తీసింది…ఈయనేనా ప్రపంచాన్ని ఊపేసిన #Kalki తీసింది… మరో అద్భుతం #Kalki2 తీస్తున్నది
దీన్ని సింపుల్ గా సింప్లిసిటీ అని కూడా అనలేం…అంతకు మించి ఏదో
మీలాగా ఉండాలి అని అనుకుంటాం…కానీ ఒక్కరోజు కూడా ఉండలేం…
Huge… pic.twitter.com/dGOR8EjCdB— Taraq(Tarak Ram) (@tarakviews) June 7, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

