BRS SIR | రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన బీఆర్ఎస్ ‘సర్’ కో ఆర్డినేషన్ కమిటీ
BRS SIR | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ SIR కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కర్నె ప్రభాకర్, ఎల్ రమణ, సుమిత్రానంద్, సతీశ్ రెడ్డి, అభిలాష్ రంగినేని మంగళవారం కలిశారు.
BRS SIR | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ SIR కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కర్నె ప్రభాకర్, ఎల్ రమణ, సుమిత్రానంద్, సతీశ్ రెడ్డి, అభిలాష్ రంగినేని మంగళవారం కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో SIR కార్యక్రమం జరుగుతుంది. కానీ BLO క్షేత్ర స్థాయిలో పనిచేయడ లేదని అన్నారు.
టెక్నికల్‌గా కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ అనుమానాలపై కొన్ని ప్రశ్నలు అడిగినా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి సమాధానం లేదని వాపోయారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న లోటుపాట్లు అనేకరకాలుగా ఉన్నాయని, వీటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి వివరించామని తెలిపారు.
ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమయం సరిపోదని, పొడిగించాలని కోరామని, ఈ విషయంపై సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారని వెల్లడించారు. కానీ ఇదివరకే బీఆర్ఎస్ తరఫున కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశామని, ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఈ ప్రక్రియ ఒక ప్రహసనంగా ఉందని, అనేక అనుమానాలు ఉన్నాయని విన్నవించినా స్పందన లేదని విమర్శించారు.
ఓటర్ల విషయంలో అనేక చిక్కులు ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కచ్చితంగా గడువు పొడిగించి, ఇచ్చిన పిటిషన్లను పరిష్కరించాలని వారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

