BRS | కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నిరసన
BRS | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై గులాబీ దండు నిరసన తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ తీసింది. అదాలత్ జంక్షన్లో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు వినయ్‌భాస్కర్‌ను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
BRS | సుబేదారి: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన వారం రోజుల నిరసన పిలుపు మేరకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు బుధవారం నిరసన చేపట్టారు. హనుమకొండ బాలసముద్రం నుంచి సుబేదారి కలెక్టరేట్ వరకు 420 హామీలతో కూడిన బ్యానర్‌తో భారీ ర్యాలీ చేపట్టారు. హనుమకొండ అదాలత్ జంక్షన్లో పోలీసులు బలగాలు ర్యాలీని అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు తోపులాట జరిగింది. హనుమకొండ ఏసీపీ నర్సింహారావు నేతృత్వంలో సుబేదారి సీఐ, కేయూ సీఐ రంజిత్‌కుమార్, రవికుమార్ పోలీసు బలగాలు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Arrest Brs Leaders
ఈ క్రమంలో పార్టీ శ్రేణులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 హామీల ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను వంచించి పీడిత పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కాదు పీడిత పాలన అంటూ నినాదాలు చేశారు. అరెస్టు అయినవారిలో దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కమరున్నీసా బేగం, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజు గణేశ్, జోరిక రమేశ్, నర్సింగ్, పార్టీ నాయకులు నార్లగిరి రమేశ్, వీరేందర్, కంజర్ల మనోజ్‌కుమార్, కలకోట్ల సుమన్, శ్రీధర్, వేల్పుల వేణుగోపాల్, రామ్మూర్తి, మహిళా నాయకులు ఉన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నాయకులను పరామర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను ముందుపెట్టి అణిచివేయడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు
Gangula Kamalakar | తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి : గంగుల కమలాకర్
Jobs | చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో 41 ఖాళీలు.. డిసెంబర్ 3 చివరితేదీ
Bisleri Water | మా నీళ్లు తాగడానికి సురక్షితమే.. బ్రోమేట్ పరీక్షలపై బిస్లరీ క్లారిటీ
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘రికార్డ్’.. ఫస్ట్ లుక్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

