హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): పార్లమెంటరీ రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావుకు చోటు లభించింది. దేశ రక్షణ రంగానికి అ త్యంత కీలకమైన పార్లమెంటరీ స్టాం డింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్‌ను శనివారం పునరుద్ధరించారు. ఇందులో 31 మంది సభ్యులను నియమించారు. వీరిలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కమిటీ చైర్‌పర్సన్‌గా బిహార్‌లోని మోతీహరి లోక్‌సభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్ తిరిగి నియామకమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని)కి అవకాశం కల్పించారు. లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కార్తీ చిదంబరం, రవి కిషన్, మీసా భారతి, జగదీశ్షెట్టార్, తిరుమాళవన్ తోల్కప్పియర్, రాజ్యసభ నుంచి ప్రము ఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్, కాంగ్రెస్ నేత పవన్‌ఖేరా, డాక్టర్ సుధాన్ష్ త్రివేది, పార్థ్ అజిత్పవా ర్, ఉజ్యల్ నికమ్, నరేశ్ బన్సల్‌కు ప్రాతినిధ్యం దక్కింది. కాగా, తెలంగాణ నుంచి లోక్‌సభ ఎంపీలకు పార్లమెంటరీ రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీలో అవకాశం లభించకపోగా రాజ్యసభ నుంచి దీవకొండ దామోదర్‌కు చోటు దక్కడం గమనార్హం.