న్యూయార్క్ : అమెరికాలోని గ్రేటర్ కేవ్ల్యాండ్ ప్రాంతంలో ఉన్న శ్రీ స్వామినారాయణ హిందూ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేశారు. గుడిలో పూజారులు, భక్తులు ఉన్న సమయంలోనే ఇటుకలతో దాడి చేసినట్టు కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ తెలిపింది.
ఈ ఘటనలో ఆలయం భవనానికి నష్టం వాటిల్లడంతో పాటు కిటికీలు పగిలిపోయాయని సంస్థ వెల్లడించింది. ఈ ఘటనను రిచ్మండ్ హైట్స్ మేయర్ కిమ్ థామస్ తో పాటు నగర అధికారులు ఖండించాలని సంస్థ చేసిన పోస్టులో కోరింది.