మహబూబ్‌నగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కంఠేశ్వర్/ధర్పల్లి/ఎల్లారెడ్డి రూరల్/దహెగాం : ప్రతిపక్ష నేతలు, రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని పలు పోలీసుస్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు మంగళవారం కూడా ఫిర్యాదులు చేశారు.
రైతులకు నీళ్లివ్వాలని ఓ విలేకరి అడిగితే వాళ్ల (ప్రతిపక్ష నేతల)ను కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయని వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని తిమ్మాజిపేట, తెలకపల్లి, తాడూరు, బిజినేపల్లి, కల్వకుర్తి, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, నారాయణపేట జిల్లా మద్దూరు, కోస్గి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, వనపర్తి జిల్లా పాన్‌గల్‌లోని పోలీస్ స్టేషన్లలో గులాబీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.