కేసీఆర్ దీక్షతోనే దిగొచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చారిత్రాత్మకమైందని, ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రను స్మరించుకుంటూ ఈ నెల 29న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎనిమిదో డివిజిన్ (అలుగునూర్)లో నిర్వహించే దీక్షా దివస్‌కు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఐదువేలకు పైగా నాయకులు, కార్యకర్తలు, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిపారు.
- తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29 చరిత్రాత్మకమైన రోజు
- అలుగునూర్‌లో ‘దీక్షా దివస్’ను విజయవంతంచేయాలి: మాజీ మంత్రి కొప్పుల
పెద్దపల్లి, నవంబర్ 18(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి కమాన్: తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చారిత్రాత్మకమైందని, ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రను స్మరించుకుంటూ ఈ నెల 29న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎనిమిదో డివిజిన్ (అలుగునూర్)లో నిర్వహించే దీక్షా దివస్‌కు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఐదువేలకు పైగా నాయకులు, కార్యకర్తలు, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించగా కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే దీక్షా దివస్ ఎంతో కీలకమైన ఘట్టమని చెప్పారు. ప్రతి గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో దీక్షా దివస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని చెప్పారు. ఆనాడు కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ఆమరణ దీక్ష వల్లనే నేడు రాష్ట్రం సిద్ధించిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

