కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాల్సిందే: వంటేరు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు వెలుగు దినపత్రిక యాజమాన్యం ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
గజ్వేల్, అక్టోబర్ 18: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు వెలుగు దినపత్రిక యాజమాన్యం ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంకావాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు.
పాలనలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి ప్రజలు, కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై వెలుగు దినపత్రికలో అసత్య కథనాలు ప్రచురించారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిని మెప్పించేందుకే అవాస్తవ కథనాలను వండి వారుస్తున్నారని ధ్వజమెత్తారు. కరువు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఫామ్‌హౌస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో గుంట ప్రభుత్వ భూమి లేదని తేల్చి చెప్పారు. ఎర్రవెల్లిలో పాండవుల చెరువు లేదని, అది గజ్వేల్‌లో ఉన్నదని తెలిపారు. సర్వేనంబర్ 325లోని 388 ఎకరాల భూమిలో రైతులు సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. భూముల విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాయడం సరికాదని హితవు పలికారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

