పండుగ వేళ.. విషాదం
కారు ఢీకొని అక్కా తమ్ముడు మృతిచెందిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్దఅంబర్‌పేటకు చెందిన ఎడుల్ల జంగయ్య కూతురు రేఖ(25) శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లిలో నివాసముంటోంది. దసరా పండుగ ఉండడంతో పుట్టింటికి వచ్చేందుకు రేఖ తన మూడున్నరేండ్ల కుమార్తెను తీసుకొని.. ఎల్బీనగర్కు వచ్చింది.
- కారు ఢీకొని.. అక్కాతమ్ముడి దుర్మరణం
- మూడున్నరేండ్ల చిన్నారికి తీవ్ర గాయాలు
హయత్‌నగర్, అక్టోబర్ 18: కారు ఢీకొని అక్కా తమ్ముడు మృతిచెందిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్దఅంబర్‌పేటకు చెందిన ఎడుల్ల జంగయ్య కూతురు రేఖ(25) శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లిలో నివాసముంటోంది. దసరా పండుగ ఉండడంతో పుట్టింటికి వచ్చేందుకు రేఖ తన మూడున్నరేండ్ల కుమార్తెను తీసుకొని.. ఎల్బీనగర్కు వచ్చింది.
అక్కడి నుంచి బాబాయి కుమారుడు నవీన్(18).. రేఖ, ఆమె కూతురిని తీసుకొని వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో హయత్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో వీరి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి అతివేగం, అజాగ్రత్తగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్, రేఖ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆమెను చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

