బంగారుతల్లి మా బతుకమ్మ
వేల పరిమళాలను చిమ్మెడు నానావర్ణ శోభిత కుసుమాలంకృతయై చెలిమి కలుముల వరదాయినిగా తెలంగాణ సంస్కృతీ విభవమై ఏటికేడు అవతరించే రంగుల పొదరింటి జవ్వని మా బతుకమ్మ!
వేల పరిమళాలను చిమ్మెడు
నానావర్ణ శోభిత కుసుమాలంకృతయై
చెలిమి కలుముల వరదాయినిగా
తెలంగాణ సంస్కృతీ విభవమై
ఏటికేడు అవతరించే
రంగుల పొదరింటి జవ్వని మా బతుకమ్మ!
అతివల కరకమల శబ్దవిన్యాసాలు
గలగలలుగా గాజుల ఒయ్యారాలు
గాలికి ఊతమిచ్చి సాగే
గానకోకిలల గాంధర్వ రాగాల
కోలాటాల ఆర్భాటాలలో
పసుపు గౌరమ్మగా
ఇంటింటి గడపలో ఒంటిగా విరబూసి
సమూహమై వరలు స్నేహదీప్తి మా బతుకమ్మ!
స్వచ్ఛమైన ప్రకృతికాంత ఒడిలో
కాలపరిణామ తీరులను కలుపుకుంటూ
రాగద్వేషాలను కొల్లగొట్టి
ఎడదలలో ప్రేమను ఒంపుకొని
మానవతా చైతన్యాన్ని నింపేందుకు
మరల మరల ప్రాదుర్భవించే
సప్తవర్ణ కాంతుల సింగిడి మా బతుకమ్మ!
ప్రాంతీయ భాషాభేదాలను మరచి
లింగభేద వైలక్షణాలను విడిచి
వయసు తీరుల తేడాలను అధిగమించి
వాడవాడలను ఏకం చేసి
నవరాత్రుల నాదమాధుర్యంలో
జలసిరుల నీలిరంగులో తేలియాడి
తన కడగంటి చూపుతో
చల్లని దీవెనలు కురిపించు
బంగారు తల్లి మా బతుకమ్మ!!
ధూళిపాళ అరుణ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

