ప్రభుత్వం పెసర్లు కొంటలే.. పంట కొనుగోలుకు సర్కార్ సవాలక్ష కొర్రీలు
కాంగ్రెస్ ప్రభుత్వ మాట విని వరికి బదులుగా పప్పులు, నూనెగింజల పంటలను సాగుచేసిన రైతులను ప్రభుత్వం నట్టేట ముంచుతున్నది. ఆ పంటల ఉత్పత్తులను కొనకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే రైతులు మార్కెట్లలో అమ్మకానికి తెచ్చిన పెసర్లు కొనేందుకు సర్కార్ ససేమిరా అంటున్నది.
- ఎఫ్ఏక్యూ లేదంటూ మార్క్ఫెడ్ ముప్పుతిప్పలు
- మార్కెట్లకు దిగుబడులు.. రైతుల ఎదురుచూపు
- రాష్ట్రవ్యాప్తంగా 50వేల టన్నుల ఉత్పత్తి అంచనా
- కొనుగోలుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరణ
- ఇప్పటివరకు కొన్నది కేవలం 30 టన్నులే
- 10వేల టన్నుల కొనుగోలుకే కేంద్రం అనుమతి
- ఆ మేరకే కొనేందుకు చర్యలు.. 4కేంద్రాలే ఓపెన్
- బయట మార్కెట్లో సగానికి సగం తగ్గిన ధర
- ‘పెసర్లు కొనండి మహాప్రభూ’ అంటూ రైతుల వేడుకోలు
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ మాట విని వరికి బదులుగా పప్పులు, నూనెగింజల పంటలను సాగుచేసిన రైతులను ప్రభుత్వం నట్టేట ముంచుతున్నది. ఆ పంటల ఉత్పత్తులను కొనకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే రైతులు మార్కెట్లలో అమ్మకానికి తెచ్చిన పెసర్లు కొనేందుకు సర్కార్ ససేమిరా అంటున్నది. ఎఫ్ఏక్యూ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతూ, కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించకుండా రైతులను గోస పుచ్చుకుంటున్నది. ఈ దశలో మార్కెట్లలో రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు రెండు జిల్లాల్లో కేవలం 4 కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. పెసర్ల కొనుగోలుకు ఓ వైపు ప్రభుత్వం నిరాకరిస్తుండటం, మరోవైపు మార్కెట్లో ధర లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పంటను అమ్ముకునే దిక్కేదంటూ ఆందోళన చెందుతున్నారు. చివరికి ‘మా పెసర్లు కొనండి మహాప్రభో’ అంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెసర్లకు మద్దతు ధర క్వింటాకు రూ.8,780 ఉండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.3,500 నుంచి రూ.5,500 వరకు మాత్రమే ధర పలుకుతున్నది. ఇలా రైతులు క్వింటాకు కనీసంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు నష్టపోతున్నారు. అయినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం సోయిలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రాల్లేవు.. కొనుడులేదు
వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల ఎకరాల్లో పెసర పంటను రైతులు సాగు చేశారు. తద్వారా సుమారు 5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, భూపాలపల్లి, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో అధికంగా పంట సాగైంది. ఇప్పటికే రైతులు పంట కోసి మార్కెట్లకు తీసుకొచ్చారు. కానీ, ప్రభుత్వం పెసర్ల కొనుగోలుకు కేంద్రాలనే ప్రారంభించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనే కేవలం 4 కేంద్రాలనే ప్రారంభించింది. ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 250 క్వింటాళ్లు మాత్రమే. అంటే ఇంకా 4,99,750 టన్నుల దిగుబడిని కొనుగోలు చేయాలి. ఇలా పెసర పంటను కొనుగోలు చేయకుండా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నది.
మార్క్ఫెడ్ ని‘బంధనాలు’
‘వెనుక నుంచి గుమ్మడికాయ పోయినా పర్వాలేదు గానీ ముందు నుంచి ఆవగింజ కూడా పోనివ్వద్దు’ అనే సామెత కాంగ్రెస్ సర్కార్కు సరిగ్గా సరిపోతుందేమో. ఓ వైపు ప్రభుత్వంలో పెద్దలు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, రైతుల కోసం ఖర్చు చేసేందుకు మాత్రం సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. పెసర్ల కొనుగోలులో ఎఫ్ఏక్యూ నిబంధనలు అంటూ ఆంక్షలు విధిస్తున్నది. నిబంధనల ప్రకారం పెసర్లు లేవంటూ కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నది. నిర్లాక్షిణ్యంగా రైతులను తిప్పి పంపుతున్నది. మార్కెట్లకు వచ్చిన అత్యధిక శాతం పంటను ఈ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయకుండా నిరాకరించినట్టుగా తెలుస్తున్నది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఇలా కొర్రీలు పెడితే తమ పంట ఎవరు కొనుగోలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తే తమకు నష్టాలేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చేతులెత్తేసిన రాష్ట్రం.. కేంద్రంపైనే భారం
పెసర్ల కొనుగోలుపై రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ భారాన్ని కేంద్రంపై నెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చే కోటా మేరకే పెసర కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క గింజ అదనంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 5 లక్షల క్వింటాళ్లు ఉత్పత్తి అయితే ఇందులో లక్ష క్వింటాళ్ల కొనుగోలుకు కేంద్రం అనుమతించింది. మిగతా 4 లక్షల క్వింటాళ్ల పంటను ఎవరు కొనుగోలు చేయాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసే ప్రసక్తే లేదని పరోక్షంగా తేల్చి చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

