హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): కులగణన కోసం ప్రభు త్వ ఉపాధ్యాయులను ఉపయోగించ డం, 30 వరకు ఒకపూట బడులు ని ర్వహించడం తగదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు. ‘కులగణన కోసం ఒక పూట మాత్రమే బడులు పెడుతారా? అది కూడా మూడు వారాలపాటు! మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఇలాం టి నిర్ణయాలు తీసుకుంటారా?’ అని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించా రు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒకరోజులోనే రాష్ట్రమంతా సమగ్ర కుటుంబ సర్వే చేశారని, గుర్తు చేశారు.