పేదలను రోడ్డుకీడ్చుతూ.. పెద్దల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న హైడ్రాపై బీఆర్ఎస్ బృందం ధ్వజమెత్తింది. ఏకంగా రూ.1100కోట్ల విలువైన సర్కారు భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆక్రమించినా హైడ్రా పట్టించుకోకపోవడంపై ఆదివారం గాజులరామారంలో నిరసనకు దిగింది. రేవంత్ సర్కారుకు దమ్ముంటే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సవాల్ విసిరారు. అలాగే నార్సింగిలో మూసీ పరీవాహకంలో బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చకపోవడంపై మాజీ మంత్రి సబితారెడ్డి ఆగ్రహించారు.
– సిటీబ్యూరో/మణికొండ/మేడ్చల్, దుండిగల్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ)