BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
BRS Dharna | జిల్లాలోని కోయిల్ సాగర్ నుంచి కొడంగల్ కి నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు వద్ద దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ధర్నా నిర్వహించారు.
మహబూబ్‌నగర్ : జిల్లాలోని కోయిల్ సాగర్ ( Koil Sagar ) నుంచి కొడంగల్ ( Kodangal) కి నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు వద్ద దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) , బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ధర్నా (BRS Dharna ) నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం నియోజకవర్గం కోసం కోయిల్ సాగర్ రైతుల పొట్టకొట్టొద్దని కోరారు. కోయిల్ సాగర్ మీద కుట్ర జరుగుతుందని 20 రోజుల ముందే హెచ్చరించామని వెల్లడించారు.
కొడంగల్ కి నీటి తరలింపుకు టెండర్లు కూడా పిలిచారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కు రైతుల మీద ప్రేమ ఉంటే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళేది కాదని అన్నారు. వర్షాకాలం పంటలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఇప్పటికే కోయిల్ సాగర్ పై ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇప్పటికైన సీఎం రేవంత్ రెడ్డి కోయిల్ సాగర్ ఆయకట్టు రైతుల పక్షాన కోరుతున్నామని, నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించారు .
లేనిపక్షంలో రైతుల పక్షాన నీళ్ల కోసం ఉద్యమిస్తామని, కొడంగల్‌కు నీళ్ల తరలింపును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వాగుల్లో ఇసుక దోపిడి మీద వున్న శ్రద్ధ రైతులకు నీళ్లు ఇవ్వడంలో లేదని తెలిపారు. కోయిల్ సాగర్ నిండాలని కరివెన రిజర్వాయర్ నుంచి కెనాల్ డిజైన్ చేశామని, మక్తల్ నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నుండి కొడంగల్ కి తాగునీటి అవసరాలకు వాడుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కమీషన్ల కోసం రైతుల నోట్లే మట్టికొడుతున్నారని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

