హైదరాబాద్,ఆట ప్రతినిధి: యువ స్ప్రింటర్ దండి జ్యోతిక శ్రీ జాతీయ అథ్లెటిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఇండియన్ గ్రాండ్ ప్రి.. 400 మీటర్ల పరుగు పందెంలో తెలంగాణకు చెందిన జ్యోతిక 54.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం సాధించిన జ్యోతికను జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు. గత కొంత కాలంగా గోపీచంద్ మైత్రా ప్రాజెక్ట్ కింద జ్యోతిక శిక్షణ పొందుతున్నది.