లండన్: బ్రిటన్ మొత్తం కరోనా కారణంగా లాక్డౌన్లో ఉంటే ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం పార్టీల పేరుతో గుంపులుగా గుమికూడేలా చేయడం యూకే ప్రభుత్వ ‘తీవ్ర వైఫల్యం’ అని విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ‘ఈ సంఘటనలో నాయకత్వ లోపం, నిర్ణయాధికార వైఫల్యం కచ్చితంగా ఉంది. దేశం మొత్తం మహమ్మారి బారిన పడి కొట్టుమిట్టాడుతుంటే ఇలాంటివి జరుగకుండా ఉండాల్సింది’ అని సీనియర్ ప్రభుత్వాధికారి సూ గ్రే స్పష్టం చేశారు. ఒకవైపు ప్రజలంతా కఠిన నిబంధనలు పాటించాలని చెప్పిన ప్రభుత్వం.. ఇలాంటి పార్టీలు చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. పార్టీ గేట్ నివేదిక అనంతరం ప్రధాని బోరిస్ క్షమాపణలు చెప్పారు. అయితే రాజీనామా చేయబోనని స్పష్టంచేశారు.