పెళ్లి తర్వాత వధువు వీడ్కోలు అనేది ఆ కుటుంబానికి అత్యంత కష్టమైన, భావోద్వేగ క్షణం. వధువు తన భర్తతో కలిసి ఇంటినుంచి బయలుదేరినప్పుడు వధువు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులంతా భారమైన హృదయాలతో వీడ్కోలు పలుకుతారు. కాగా, మనుమరాలు పెళ్లి చేసుకొని వెళ్తుండగా, ఆమె నానమ్మ కంటతడిపెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో వధువు అందమైన లెహంగా, నగలు ధరించి తన అత్తారింటికి వెళ్లే ముందు తన నానమ్మను కలిసేందుకు వస్తుంది. ఆమెను చూసి వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుని వధువును గట్టిగా కౌగిలించుకుంటుంది. వధువు తన బామ్మను ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది. ‘నేను మిమ్మల్ని విడిచి చాలాదూరం వెళ్లడం లేదు. పది కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్తున్నాను. మళ్లీ వస్తాను.’ అంటూ వధువు నానమ్మను ఓదారుస్తుంది. ఈ వీడియోను నూరియత్ మువా అనే యూజర్ ఇన్స్టాలో అప్లోడ్ చేశారు.