మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పెళ్లి కుమార్తెను ఆమె మాజీ ప్రియుడు చంపేశాడు. ఈ ఘటన ముబారిక్పుర్ గ్రామంలో జరిగింది. వెడ్డింగ్ జరుగుతున్న సమయంలో పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను షూట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాజల్ అనే అమ్మాయి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి సిద్దమైంది. జైమాల వేడుక జరిగిన తర్వాత అకస్మాత్తుగా వచ్చిన ఆమె మాజీ ప్రియుడు పిస్తోల్‌తో కాల్చి చంపాడు. మరో వ్యక్తితో పెళ్లి జరగడాన్ని తట్టుకోలేకపోయిన ఆ వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బుల్లెట్ శబ్ధం విన్న ఆమె కుటుంబ సభ్యులు అమ్మాయి రూమ్‌కు చేరుకున్నారు. పెళ్లి కుమార్తె తండ్రి ఈ ఘటనకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అన్ని కోణాలను ఈ కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.