మిల్క్ బ్రెడ్: నాలుగు స్లెసులు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: చిటికెడు, చక్కెర: అర కప్పు, కాజు, కిస్మిస్: ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, పాలు: పావు కప్పు.
బ్రెడ్ స్లెసుల అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని దోరగా వేయించి తీయాలి. అదే పాన్లో కాజు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టాలి. పాన్లో మిగిలిన నెయ్యిలోనే ఒక కప్పు నీళ్లు, చక్కెర వేసి బాగా మరిగించి.. అప్పటికే వేయించిన బ్రెడ్ ముక్కల్ని రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా పాలు, యాలకుల పొడి, వేయించిన కాజు, కిస్మిస్ జోడించి రెండు నిమిషాలు ఉడికించి దించితే సరి. నోరూరించే బ్రెడ్ హల్వా సిద్ధం.