స్వర్ణమే లక్ష్యంగాన్యూఢిల్లీ: బ్రెజిల్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ పారా షట్లర్ ప్రమోద్ భగత్, సుకాంత్ కదమ్ బరిలోకి దిగుతున్నారు. రెండేండ్ల విరామం తర్వాత మంగళవారం బ్రెజిల్ వేదికగా బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ లెవల్-2 టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ నుంచి 9 మంది అగ్రశ్రేణి పారా షట్లర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ లక్ష్యంగా మన షట్లర్లు ఈ టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. స్పానిష్ టోర్నీలో రెండు రజతాలు, ఓ కాంస్యంతో అదరగొట్టిన భగత్ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాడు. ఇదే టోర్నీలో కాంస్యంతో సరిపెట్టుకున్న సుకాంత్ టైటిల్‌పై కన్నేశాడు. మిగతా షట్లర్లు మనోజ్ సర్కార్, తరుణ్ ధిల్లాన్, పరూల్ పర్మార్, నితేశ్ రాణా, మానసి జోషి, పాలక్ కోహ్లీ, నిత్య శ్రీ సత్తా చాటాలని తహతహలాడుతున్నారు.