ముంబై : ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం పుణెలో పంజాబ్‌తో జరగాల్సిన మ్యాచ్ వేదికను ముంబైకి మార్చారు. బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ ఒక ప్రకటనలో చెప్పింది. ఢిల్లీ జట్టులో మిచెల్ మార్ష్‌తో పాటు మరో అయిదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్, మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్, టీమ్ డాక్టర్ అభిజిత్ సాల్వి, సోషల్ మీడియా కాంటెంట్ మెంబర్ ఆకాశ్ మానేలకు వైరస్ సంక్రమించింది. బుధవారం ఉదయం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు ఆర్టీపీసీర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ పరీక్షలో నెగటివ్ వస్తేనే ఆటగాళ్లు మ్యాచ్ ఆడే వీలుంది. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. మళ్లీ ఆరో రోజు, ఏడో రోజు పరీక్షలు జరిపి, ఒకవేళ వాళ్లు నెగటివ్ వస్తేనే తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంటుంది.