ఇంద్రవెల్లి : రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని అనంతపూర్ గ్రామ సమీపంలో శనివారం జరిగింది. ఎస్సై సాయన్న, 108 అంబులెన్స్ పైలెట్ ఆత్రం అశోక్ తెలిపిన వివరాల ప్రకారం. ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామానికి చెందిన హర్షద్ సల్మా దంపతుల 13 ఏళ్ల కుమారుడు సుహన్ ( Suhan ) సిరికొండ మండలంలోని బంధువుల వద్ద ఉంటూ ఉర్దూ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు.
మామ ఆలాం ప్రతి రోజు ట్రాలీ ఆటోతో గ్రామీణ ప్రాంతంలోని కిరాణ దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తు జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే మామ ఆలాం ట్రాలీ ఆటోతో గ్రామాలకు తీసుకెళ్లడంతో మామకు తోడుగా బాలుడు సుహన్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఇంద్రవెల్లి మండలంలోని అనంతపూర్ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాలీ ఆటో బోల్తా పడడంతో బాలుడు సుహన్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.