బెర్లిన్: బాక్సింగ్ లోకం మరో మేటి స్టార్‌ను కోల్పోయింది. జర్మనీ చాంపియన్ ముసా యామక్ గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మునిచ్‌లో జరిగిన బౌట్లో 38 ఏళ్ల స్టార్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఉగాండాకు చెందిన హమ్జా వండెరాతో జరుగుతున్న మ్యాచ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రేక్షకులకు మ్యాచ్‌ను లైవ్‌లో స్ట్రీమింగ్ చేస్తుండగా బాక్సర్ ముసా మరణించాడు. యురోపియన్, ఏషియన్ చాంపియన్‌షిప్‌లను అతను గెలిచినట్లు టర్కీ అధికారి హజన్ తురాన్ తన ట్వీట్లో తెలిపారు.
మ్యాచ్ మూడవ రౌండ్ ఆరంభంలో బాక్సర్ ముసా కుప్పకూలాడు. రెండవ రౌండ్లో వండెరా భారీ పంచ్‌తో ముసాకు ముచ్చెమటలు పట్టించాడు. రింగ్ వద్దకు వైద్య బృందం చేరుకున్నా.. బాక్సర్ మాత్రం ప్రాణాలు దక్కించుకోలేదు. జర్మనీకి చెందిన బాక్సర్ ఇప్పటి వరకు అజేయుడిగా నిలిచాడు. 8-0 రికార్డుతో అతను దూసుకెళ్తున్నాడు. టర్కీలో పుట్టిన ముసా యామక్ 2017లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు.