అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) సంచలన వ్యాఖ్యలు ( Sensational Comments ) చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రెండు రోజుల క్రితం అమరావతి పనుల పునః ప్రారంభం చేయించిన విషయం తెలిసిందే.
సోమవారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. మళ్లీ పెళ్లి అన్నట్లు అమరావతికి ( Amaravati capital ) పునః ప్రారంభం చేశారని వ్యాఖ్యనించారు. అమరావతికి లక్ష కోట్లు తెచ్చుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుకు ఉందని అన్నారు. విశాఖ నూతన రైల్వే జోన్, రైల్వే భవనాలు ఎందుకు నిర్మంచలేదని ప్రశ్నించారు. టీ
డీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆలయాల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సింహాచలంలో గోడకూలి 8 మంది భక్తులు మరణించడం నాయకులు, అధికారుల నిర్లక్ష్యమేనని అన్నారు. సింహాచలంలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని మండిపడ్డారు. కూటమి మోసపూరిత హామీలతో రాష్ట్రంలో వైసీపీ ఓటమిపాలయ్యిందని పేర్కొన్నారు.
11 నెలల్లో కాలంలో ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. అప్పు ఏం చేశారో ఏపీ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.