India vs Australia | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఐదో టెస్ట్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా.
సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో 141/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 157 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లుగా వచ్చిన కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్ దూకుడుగా ఆడుతుండగా.. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కొన్‌స్టాస్ 22 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 39 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లోనే మరో ఓపెనర్ మార్నస్ లబుషేన్ కూడా ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్ వెళ్లే బంతిని ఆడి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు లబుషేన్.
అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన స్మిత్ 4 పరుగులకే వెనుదిరగగా.. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖావాజా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే దూకుడుగా ఆడుతున్న ఖావాజను 41 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కి చేరాడు. దీంతో 104 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన వెబ్ స్టార్ మిగిలిన టార్గెట్‌ని పూర్తి చేశాడు. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా (41), వెబ్‌స్టర్ (39*), ట్రావిస్ హెడ్ (32*), కొన్‌స్టాస్ (22) టాప్ స్కోరర్లుగా నిలువగా.. భారత బౌలర్లలో ప్రసిధ్ 3, సిరాజ్ ఒక వికెట్ అందుకున్నారు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2015 తర్వాత దాదాపు 10 ఏండ్లకు మళ్లీ గెలుచుకుంది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరోవైపు ఇప్పటికే దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే