లోకల్.. నాన్‌లోకల్ వార్
నగరంలో గ్యాస్ కొరత అధికంగా ఉండడంతో నగరంలోని గ్యాస్ బంకుల్లో ఇతర జిల్లాల ఆటోలకి ఇంధనం పోయొద్దంటూ స్థానిక ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము సాంకేతికంగా నల్గొండ, మెదక్ తదితర జిల్లాలలో ఉంటున్నా..
- ఆటో డ్రైవర్ల మధ్య ముదురుతున్నసరిహద్దు వివాదం
- ఇతర జిల్లాల ఆటోలకు నగరంలోకి నో ఎంట్రీ
సిటీబ్యూరో: నగరంలో గ్యాస్ కొరత అధికంగా ఉండడంతో నగరంలోని గ్యాస్ బంకుల్లో ఇతర జిల్లాల ఆటోలకి ఇంధనం పోయొద్దంటూ స్థానిక ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము సాంకేతికంగా నల్గొండ, మెదక్ తదితర జిల్లాలలో ఉంటున్నా.. తమ జీవనాధారం హైదరాబాద్ పైనే ఆధారపడిందని చెబుతున్నారు. జిల్లా కేంద్రాలు దూరంగా ఉండటం, అకడ ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో నగరంలో తిరగకపోతే కుటుంబ పోషణ కష్టమవుతోందని వారు పేరొంటున్నారు.
సరిహద్దుల్లో ఉన్న ఆటో డ్రైవర్ లు తమ జిల్లా కేంద్రాలు 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని వచ్చే గిరాకీ అంతా సమీపంలోని నగరానికే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి రాకపోకలు ఎకువగా ఉండటం వల్ల ఇతర జిల్లాల ఆటోలకి కూడా నగరంలోకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య పంచాయితీ రవాణా శాఖ అధికారుల వద్దకు చేరింది. కాగా, తాజాగా 65 వేల ఆటోలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించింది.
అందులో సీఎన్జీ, ఎల్పీజీ, పదివేలు, ఈవీ 20 వేలు, 25 వేలు రేట్రాఫిట్మెంట్ ఆటోలకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్షా ఇరవై వేల ఆటోలు తిరుగుతున్నాయి. వాటిలో సగానికి పైగా 15 సంవత్సరాలకు పైబడిన పాత వాహనాలే. పాత ఆటోలను అధికారికంగా తొలగించిన తర్వాత మాత్రమే కొత్త సీఎన్జీ లేదా ఎల్పీజీ ఆటోలకు అనుమతి ఇవ్వడం వల్ల పాత ఆటోలకే భారీ డిమాండ్ ఏర్పడింది. పాత ఆటోలు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు అమ్ముడవుతున్నాయని, ఇది పెద్ద మాఫియాగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

