బాలీవుడ్ ప్రముఖ నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ రాణి ముఖర్జీకి ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత లా ట్రోబ్ యూనివర్సిటీ (La Trobe University) నుంచి ‘గౌరవ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్’ (Honorary Doctor of Letters) లభించింది. దాదాపు మూడు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో ఆమె భారతీయ సినిమాకు అందించిన సేవలతో పాటు, మహిళలు, పిల్లలు, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అరుదైన గౌరవాన్ని అందజేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది.
మెల్బోర్న్లో ఘనంగా జరుగుతున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (IFFM) వేడుకల్లో భాగంగా ఆగస్టు 14న ఈ డాక్టరేట్ ప్రదానోత్సవం అధికారికంగా జరిగింది. ఈ సందర్భంగా రాణి ముఖర్జీ భావోద్వేగంతో స్పందిస్తూ.. తన జీవిత ప్రయాణంలో సినిమానే తనకు అతిపెద్ద గురువని, బలమైన కథల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని తాను గట్టిగా నమ్ముతానని తెలిపారు. ఈ అరుదైన గౌరవాన్ని తన మాతృభూమి అయిన భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా తనను ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు ఆమె పేర్కొంది.
Some moments make you stop and take a moment to truly appreciate the journey. Today is one of them.
Receiving an Honorary Doctorate from La Trobe University, after nearly three decades in cinema, is a deeply humbling honour. Every character, every story and every experience has… pic.twitter.com/Iew6JGNEF7
— Yash Raj Films (@yrf) August 14, 2026