పోతంగల్ : వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు రికార్డులతోపాటు ల్యాబ్, ఫార్మసీ, వార్డులను పరిశీలించారు.
సీజనల్ వ్యాధులపట్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులపట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి ప్రభుత్వ వైద్యంపట్ల నమ్మకం కల్పించాలని చెప్పారు. అనంతరం మండలంలోని దోమలెడ్గి ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి అక్కడున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ కరణ్, ఎమ్ఎల్ హెచ్పీ మీర్జ, హెల్త్ సూపర్వైజర్ సావిత్రి తదితరులు ఉన్నారు.