TTD | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తేతెలంగాణ ) : తిరుమలలో టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేశ్‌కుమార్ శ్రీవారి సన్నిధిలో టీటీడీ ఉద్యోగిపై బూతు పురాణంతో రెచ్చిపోయాడు. మహాద్వారం తలుపులు తీయనందుకు ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థానికులు వివరాల ప్రకారం… వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్‌కుమార్ మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని.. తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నాడు.
అప్పటికే తలుపులను టీటీడీ ఉద్యోగి బాలాజీ అధికారుల ఆదేశాలతో మూసివేశాడు. ఈ క్రమంలో నరేశ్‌కుమార్ తలుపులు తీయాలని కోరగా. ఈ వో, అడిషనల్ ఈవో ఆదేశాల మేరకు మహాద్వారం గేటు నుంచి ఎవరినీ పంపడం లేదని బదులిచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన నరేశ్‌కుమార్ బాలాజీని థర్డ్‌క్లాస్ నా కొడుకువి.. నిన్ను ఇక్కడ పెట్టిందెవరు.. ఏమనుకుంటున్నావ్? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా.. నువ్వు బయటకుపో అని ఉద్యోగిని బూతులు తిట్టాడు. ఉద్యోగులు విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకెళ్లారు.