Bisleri Water | మా నీళ్లు తాగడానికి సురక్షితమే.. బ్రోమేట్ పరీక్షలపై బిస్లరీ క్లారిటీ
Bisleri Water | బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితం కాదంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) చేసిన ప్రకటనపై కంపెనీ స్పందించింది. తమ ఉత్పత్తులు తాగడానికి సురక్షితమేనని స్పష్టం చేసింది.
Bisleri Water | బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితం కాదంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) చేసిన ప్రకటనపై కంపెనీ స్పందించింది. తమ ఉత్పత్తులు తాగడానికి సురక్షితమేనని, నాణ్యత నియంత్రణలో భాగంగా కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. గోవాలోని తమ తయారీ కేంద్రం నుంచి సేకరించిన నమూనాల పరీక్షల విషయంలో తలెత్తిన వివాదంపై వివరణ ఇచ్చింది. పరిమితికి మించి బ్రోమేట్ ఉన్నట్లు నమోదైన నమూనాను స్వతంత్ర ల్యాబ్‌లలో పరీక్షించగా, నిర్దేశిత పరిమితుల్లోనే ఉన్నట్లు తేలిందని పేర్కొంది.
2025 సెప్టెంబర్ 30న గోవాలోని తమ తయారీ కేంద్రం నుంచి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరు నమూనాలను సేకరించిందని బిస్లరీ తెలిపింది. ప్రాథమిక పరీక్షల్లో ఐదు నమూనాలు అన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఆరో నమూనాలో మాత్రం లీటరుకు 10 మైక్రోగ్రాముల బ్రోమేట్ పరిమితికి బదులుగా 12 మైక్రోగ్రాములు నమోదైనట్లు వెల్లడించింది. దీనిపై అప్పీల్ చేయగా, రిఫరల్ ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో బ్రోమేట్ స్థాయి నిర్దేశిత పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని కంపెనీ వివరించింది. అదే నమూనాను ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు పొందిన మరో స్వతంత్ర ల్యాబొరేటరీలోనూ పరీక్షించగా, బ్రోమేట్ పరిమితికి లోబడే ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొంది.
స్వతంత్ర పరీక్షల ఫలితాలను జతచేస్తూ 2026 ఫిబ్రవరి 2న ఎఫ్ఎస్ఎస్ఏఐ వెస్ట్రన్ రీజినల్ కార్యాలయానికి అధికారిక లేఖ పంపినట్లు బిస్లరీ తెలిపింది. అయితే ఆ తర్వాత సంస్థ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నోటీసు తమకు ఈ-మెయిల్ ద్వారా గానీ, భౌతికంగా గానీ అందలేదని, ఎఫ్ఎస్ఎస్ఏఐ వెబ్సైట్లోనూ ఆ నోటీసును గుర్తించలేకపోయామని వివరించింది.
తాగునీటి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని బిస్లరీ స్పష్టం చేసింది. తయారీ ప్రక్రియలో 10 దశల నాణ్యత నియంత్రణ విధానాన్ని అనుసరిస్తున్నామని, 90కి పైగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ తయారీ కేంద్రాల్లో కఠినమైన నాణ్యత ప్రమాణాలను అమలు చేస్తున్నామని పేర్కొంది. వినియోగదారులకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ అంశంపై నియంత్రణ సంస్థతో తగిన ప్రక్రియలో సహకరిస్తామని వెల్లడించింది.

Bisleri1

Bisleri2
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bisleri Water | మా నీళ్లు తాగడానికి సురక్షితమే.. బ్రోమేట్ పరీక్షలపై బిస్లరీ క్లారిటీ
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘రికార్డ్’.. ఫస్ట్ లుక్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
BRS | నాగార్జునసాగర్ నుంచి పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు ఆపాలి.. కృష్ణా బోర్డుకు బీఆర్ఎస్ ఫిర్యాదు
Pokers camp | లాలాగూడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 25 మంది అరెస్ట్
Bhogi | శర్వానంద్–డింపుల్ హయాతి క్లోజ్ వీడియో వైరల్.. కొత్త రూమర్స్‌కు తెరలేపిన ‘భోగి’ వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

