Bird Flu | తిరువనంతపురం: ‘బర్డ్ ఫ్లూ’ వైరస్ వ్యాప్తి కేరళలో కలకలం రేపుతున్నది. అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఇడతవా గ్రామంలోని వార్డ్-1, చిరుతానా గ్రామంలోని వార్డ్-3లోని బాతుల నుంచి సేకరించిన నమూనాలు భోపాల్ ల్యాబ్‌కు పంపగా, వాటికి ‘బర్డ్ ఫ్లూ’ (హెచ్5ఎన్1) వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న ఆ రెండు గ్రామాల్లోని 21 వేల బాతులను, కిలోమీటర్ పరిధిలోని పక్షుల్ని అధికారులు చంపేయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ‘